అదితీరావ్‌ స్థానంలో రాశీఖన్నా?

అదితీరావ్‌ స్థానంలో రాశీఖన్నా?

17-08-2019

అదితీరావ్‌ స్థానంలో రాశీఖన్నా?

బెంగాల్‌ టైగర్‌, టచ్‌ చేసి చూడు సినిమాల్లో కలసి నటించారు రవితేజ, రాశీ ఖన్నా. ఈ ఇద్దరూ మూడోసారి కలసి నటించనున్నారని తెలిసింది. ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత దర్శకుడు అజయ్‌ భూపతి మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో రవితేజ, సిద్ధార్థ్‌ హీరోలుగా యాక్ట్‌ చేస్తారని సమాచారం. రవితేజకు జోడీగా అదితీరావ్‌ హైదరీ నటించనున్నారని వార్తలు వచ్చాయి. డేట్స్‌ ఇష్యూ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రాశీఖన్నా వచ్చారని తెలిసింది. సెప్టెంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.