'లైఫ్‌ అనుభవించు రాజా' ఫస్ట్‌లుక్‌ విడుదల

'లైఫ్‌ అనుభవించు రాజా' ఫస్ట్‌లుక్‌ విడుదల

16-08-2019

'లైఫ్‌ అనుభవించు రాజా' ఫస్ట్‌లుక్‌ విడుదల

ఎఫ్‌ అండ్‌ ఆర్‌ సమర్పణలో రాజారెడ్డి మూవీ మేకర్స్‌ పతాకంపై రవితేజ (జూనియర్‌) నిక్కీ శ్రావణి, శృతిశెట్టి హీరో హీరోయిన్లుగా తిరుమారు దర్శకత్వంలో రాజారెడ్డి కందుల నిర్మిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ లైఫ్‌ అనుభవించు రాజా. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆకాశ్‌ పురి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టు సాల్మన్‌, కెమెరామెన్‌ రజని, దర్శకుడు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్‌ పూరి మాట్లాడుతూ ఫస్ట్‌లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉందన్నారు. ఈ టీంకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. దర్శకుడు సురేష్‌ మాట్లాడుతూ ఇదొక వైరెటీ చిత్రమన్నారు. మా చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఆకాష్‌ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు.