అక్కినేని అమల ముఖ్యపాత్రలో వెబ్‌సిరిస్‌ ...

అక్కినేని అమల ముఖ్యపాత్రలో వెబ్‌సిరిస్‌ ...

15-04-2019

అక్కినేని అమల ముఖ్యపాత్రలో వెబ్‌సిరిస్‌ ...

శ్రీమతి అక్కినేని అమల చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జి5 యాప్‌ నిర్మించిన వెబ్‌సిరిస్‌ హైప్రిస్ట్స్‌ లో అమల ముఖ్యపాత్ర పోషించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరిస్‌ ఈ నెల 25 నుంచి జి5లో ఆన్‌లైన్‌ అవుతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. టారో రీడింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరిస్‌ను పుష్ప డైరెక్టు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అమలతోపాటతు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, సునైనా, బిస్‌బాస్‌ 2 ఫేం నందిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి అమల మాట్లాడుతూ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తెరపై తక్కువగా కన్పిస్తున్నానని, చాలా రోజు తర్వాత పుష్పగారు చెప్పిన లైన్‌ నచ్చటంతో ఈ  ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు. తనకు బాగా ఆసక్తిగా అన్పించే టారో రీడింగ్‌ నేపథ్యంలో ఈ వెబ్‌సిరిస్‌ కథ ఉండటం తనకు బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అన్నారు.