ఈ మూడు రంగాలతోనే నా జీవితం

ఈ మూడు రంగాలతోనే నా జీవితం

15-04-2019

ఈ మూడు రంగాలతోనే నా జీవితం

రకుల్‌ని కదిపితే చాలు మూడు పరిశ్రమల ముచ్చట్లని వరుసబెట్టి చెప్పేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోందామో. మామూలుగా ఒక బాషలో అవకాశాలు అందుతున్నప్పుడు, మరో వైపు వెళ్లడానికి ఇష్టపడరు కదా అని రకుల్‌ని అడిగితే.. మంచి కథలు ఎక్కడి నుంచి వస్తే అక్కడ నటించడానికి నేను సిద్ధం. మూడు పరిశ్రమల చుట్టూ ఎలా తిరుగుతావని అడుగుతారు చాలా మంది. అసలు నాకది సమస్యే కాదు. చేసే పనిని ఆస్వాదిస్తున్నప్పుడు.. మన కలలతో పాటు ప్రయాణం చేస్తున్నపుడు ఏది సమస్యగా అనిపించదు. నా విషయంలోనూ అంతే. సినిమాలే కాదు.. ఇంకా చాల పనుల్ని చక్కబెడుతుంటా. సినిమాలు, ఫుడ్‌, ఫిట్‌నెస్‌.. ఈ మూడు నా జీవితంలో కీలకమైనవి. భవిష్యత్తులోనూ ఈ మూడు రంగాలతో ముడిపడే ఉంటుంది నా జీవితం అందామె. రకుల్‌ తెలుగులో మన్మథడు2లో నటిస్తోంది.