ఇప్పుడు అదే పాత్రకు మిల్కీ బ్యూటీ సై!

ఇప్పుడు అదే పాత్రకు మిల్కీ బ్యూటీ సై!

15-04-2019

ఇప్పుడు అదే పాత్రకు మిల్కీ బ్యూటీ సై!

పంజాబీ సోయగం మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ జోరుగా సాగిపోతున్నది. తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సుందరి. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ నటిగా తన ప్రతిభాపాటవాల్ని చాటాలని తపిస్తున్న ఈ అమ్మడు తాజాగా తమిళంలో ఓ హారర్‌ కామెడి సినిమాకు ఓకే చెప్పింది. వివరాల్లోకి వెళితే.. తాప్సీ ప్రధాన పాత్రలో తెలుగులో రూపొందిన ఆనందోబ్రహ్మ చిత్రం చక్కటి విజయాన్ని సాధించింది. హారర్‌, కామెడీ, సెంటిమెంట్‌ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా నటించనుందని సమాచారం. కథ నచ్చడంతో ఈ సినిమాలో భాగమవడానికి తమన్నా సుమఖంగా ఉందని చెబుతున్నారు. ఆనందో బ్రహ్మ చిత్రంలో దెయ్యం పాత్రలో నటించింది తాప్సీ. ఇప్పుడు అదే పాత్రను తమన్నా తమిళంలో పోషించనుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సైరా నరసింహారెడ్డి, దటీజ్‌ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తున్నది. అభినేత్రి-2 త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.