ప్రియాంక చోప్రా అన్ ఫినిష్డ్

ప్రియాంక చోప్రా అన్ ఫినిష్డ్

11-02-2019

ప్రియాంక చోప్రా అన్ ఫినిష్డ్

మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ విజేతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియాంకచోప్రా హిందీ చిత్రసీమలో అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. ఆపై హాలీవుడ్‌లో ఆ దృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ కూడా విజయకేతాన్ని ఎగరేసింది. ఇటీవలే హాలీవుడ్‌ నటుడు, గాయకుడు నిక్‌జోనాస్‌ను పెళ్లాడిన ఈ సొగసరి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే విరామ సమయాల్లో ఈ అమ్మడు తన జీవితంలోని ముఖ్యఘట్టాన్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని రాస్తున్నదట. ప్రియాంక జీవన గమనంలో మరుపురాని జ్ఞాపకాలకు అక్షరరూపమిదని, ఎవరికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయని ప్రియాంక సన్నిహితులు పేర్కొన్నారు. అన్‌ఫినిష్డ్‌ అనే శీర్షికతో ఈ పుస్తకం రాబోతున్నదని సమచారాం. ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ ఈ పుస్తక ముద్రణ బాధ్యతల్ని తీసుకుందని తెలిసింది.