బతికున్న వాళ్లపై బయోపిక్ లా?

బతికున్న వాళ్లపై బయోపిక్ లా?

10-01-2019

బతికున్న వాళ్లపై బయోపిక్ లా?

బతికి ఉన్న వారిపై బయోపిక్‌లు తీయడం సమంజసం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ లాబీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను శివాజీ మీడియాకు తెలిపారు. తన జీవితాన్ని చిత్రంగా తీయడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ వ్యతిరేకించారని శివాజీ తెలిపారు. ప్రధాని కార్యాలయం ఉద్యోగులే సమాచారాన్ని లీక్‌ చేయడం సరైన పద్దతి కాదని చెప్పారన్నారు. దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. నాడు పీవీ నరసింహరావు తనకు ఆర్థిక సంస్కరణల అమలులో పూర్తి స్వేచ్ఛనిచ్చారని గుర్తు చేసుకున్నారన్నారు. నాటి పటిష్ఠంగా చట్టాలు తీసుకురావడం వల్లే నేడు వాటిని మార్చే అవకాశం రాలేదని, ఆర్థిక వ్యవస్థ బాగుందని మన్మోహన్‌ తెలిపారన్నారు. నేడు దేశంలో నిజాయతీ కన్నా రాజకీయం, హింస పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని శివాజీ తెలిపారు.