భాగ్యనగరంలో తెలుగు వెలుగు

భాగ్యనగరంలో తెలుగు వెలుగు

16-12-2017

భాగ్యనగరంలో తెలుగు వెలుగు

ప్రపంచంలోని ఎక్కడెక్కడో నివసిస్తున్న తెలుగువారు ఒక్కచోటికి చేరారు. ఎట్లున్నరని ఒకరు, బాగున్నారా అని మరొకరు, ఇలా తీయని తెలుగులో పలకరించుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజు లాల్‌బహదూర్‌ మైదానంలో ఆవిష్కృతమైన ఇలాంటి సందర్భాలు లెక్కకు మిక్కిలిగా కనిపించాయి. సింగపూర్‌, కువైట్‌, దుబాయ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాల నుంచి తెలుగువారు భాగ్యనగరానికి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భాషాభిమానులు విచ్చేశారు.