జీఈఎస్‌ షెడ్యూల్‌ ఇదీ..

జీఈఎస్‌ షెడ్యూల్‌ ఇదీ..

27-11-2017

జీఈఎస్‌ షెడ్యూల్‌ ఇదీ..

జీఈఎస్‌ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంక ప్రసంగిస్తారు. దీంతోపాటు ఇవాంక మరో రెండు చర్చాగోష్ఠుల్లో మాట్లాడతారు. తర్వాత ‘మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు’అంశంపై చర్చాగోష్ఠి ఉంటుంది. ఇందులో ఇవాంక, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్‌ఆర్‌ఎస్‌ ఏవియేషన్స్‌ అండ్‌ పెట్రోలియం ఎండీ సిబోంగైల్‌ సింబో, ఎస్‌ఈబీ చైర్మన్‌ మార్కస్‌ వాలెన్‌బర్గ్‌ మాట్లాడతారు. సిస్కో చైర్మన్‌ జాన్‌ చాంబర్‌ దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 

రెండోరోజు.. 
‘మానవ వనరుల వృద్ధిలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం’అంశంపై 29న ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్‌ ఉంటుంది. మంత్రి కె.తారకరామారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంకతోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య, సామాజిక కార్యకర్త చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో చందా కొచర్, డెల్‌ ఈఎంసీ చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ కరేన్‌ క్వింటోస్‌లు మాట్లాడతారు.