హైదరాబాద్‌లో హై సెక్యూరిటీ

హైదరాబాద్‌లో హై సెక్యూరిటీ

23-11-2017

హైదరాబాద్‌లో హై సెక్యూరిటీ

అమెరికాకు చెందిన ప్రత్యేక నిఘా ఉపగ్రహం హైదరాబాద్‌ నగరాన్ని ప్రతీక్షణం పర్యవేక్షిస్తోంది. ఆ దేశాధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ పర్యటన ముగిసే వరకు దీని నిఘా కొనసాగనుంది. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌) ఏజెంట్లు ఆ శాటిలైట్‌ అందించే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక, ప్రధాని నరేంద్రమోదీ రానున్న నేపథ్యలో అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌తో పాటు ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.