జీఈఎస్ లో ప్రముఖుల ప్రసంగాలు

జీఈఎస్ లో ప్రముఖుల ప్రసంగాలు

17-11-2017

జీఈఎస్ లో ప్రముఖుల ప్రసంగాలు

హైదరాబాద్ లో ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2017 (జీఈఎస్)లో 30 మంది దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ అనుభవాలను పంచుకోనున్నారు. భారతదేశం నుంచి మ్యాప్-మై-జినోమ్ సీఈవో అనూ ఆచార్య, ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందాకొచ్చర్, నగరంలోని డీఆర్డీవో డైరెక్టర్ థెస్సీ థామస్, ప్రసారభారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఓయో రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్, ఐబీఎం ఇంజినీర్ రమా అక్కిరాజు, స్టార్‌చెఫ్ వికాస్ ఖన్నా, ప్రథమ్ ఎడ్యుకేషన్‌కు చెందిన రుక్మిణీ బెనర్జీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సీఈవో దీపాన్విత ప్రసంగించనున్నారు. వీరితోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెర్రి బ్లెయిర్ కూడా సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు.