హైదరాబాద్‌ పర్యటనపై ఇవాంకా ఉత్సాహం

హైదరాబాద్‌ పర్యటనపై ఇవాంకా ఉత్సాహం

15-11-2017

హైదరాబాద్‌ పర్యటనపై ఇవాంకా ఉత్సాహం

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో జరుగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ఉత్సాహంగా ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఆవిష్కరణలు పాల్గొనే సదస్సులో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొనబోతున్నానని తెలిపారు. రెండు వారాల్లో భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలువబోతున్నానని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ వీక్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.