తెలంగాణలో థాయ్‌లాండ్‌ పెట్టుబడులు

తెలంగాణలో థాయ్‌లాండ్‌ పెట్టుబడులు

18-01-2020

తెలంగాణలో థాయ్‌లాండ్‌ పెట్టుబడులు

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ అని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. థాయ్‌లాండ్‌తో భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలున్నాయని తెలిపారు. మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని కోరారు. రబ్బర్‌వుడ్‌ పరిశ్రమలో థాయ్‌లాండ్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నదని తెలిపారు. భారత్‌తో థాయ్‌కు చాలా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలంగాణలో వాణిజ్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపార అవకాశాలున్నట్లు ఈ సందర్బంగా మంత్రి అన్నారు.

ఇదే సమయంలో మంత్రి.. తెలంగాణలో ఫర్నిచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని థాయ్‌లాండ్‌ ఉప ముఖ్యమంత్రిని కోరారు. బ్యాంకాక్‌-హైదరాబాద్‌ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ థాయ్‌ ప్రభుత్వానికి కోరారు.