గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమేశ్ కుమార్ సమావేశం

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమేశ్ కుమార్ సమావేశం

17-01-2020

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై  సోమేశ్ కుమార్ సమావేశం

పబ్లిక్ గార్డెన్స్ లో జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 26న ఉదయం పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్రదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయ న్నారు. వేడుకలకు అవసరమైన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, డిజిపి మహేందర్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, శివశంకర్ ,ఐ.ఎ.ఎస్ (Retd.), ఆర్ధిక శాఖ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.