భారతదేశ ఏకైక సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ మాట్రెస్ శ్రేణిని ప్రవేశపెట్టిన డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్

భారతదేశ ఏకైక సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ మాట్రెస్ శ్రేణిని ప్రవేశపెట్టిన డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్

11-10-2019

భారతదేశ ఏకైక సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ మాట్రెస్ శ్రేణిని ప్రవేశపెట్టిన డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్

నేటి కాలంలో, వెన్నునొప్పి అనేది కేవలం వయస్సు సంబంధిత సమస్య కాద నే అవగాహన క్రమంగా పెరుగుతోంది. తప్పుగా కూర్చొనే భంగిమలు, వ్యాయామం లేకపోవడం, రోజువారీ ఒత్తి డి వంటి కొన్ని తెలిసిన కారణాలతో ఏర్పడే సాధారణ జీవనశైలి సమస్య ఇది.  

మాట్రెస్ అనేది మీకు రాత్రి పూట మంచి నిద్రను ఇవ్వడంతో పాటు, నొప్పిని తగ్గించేలా ఈ సమస్యను పరిష్క రించడానికి  మీ వెనుకభాగానికి సరైన సౌకర్యాన్ని, సపోర్టను అందించేలా ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశ అగ్రగామి, వినూత్న మాట్రెస్ బ్రాండ్ అయిన డ్యూరోఫ్లెక్స్, నేషనల్ హెల్త్ అకాడమీ ధ్రువీకరించిన  భారతదేశ మొట్టమొదటి ఆర్థోపెడిక్ మాట్రెస్ – డ్యూరోపెడిక్ మాట్రెస్ ను ఆవిష్కరించింది. డ్యూరోపెడిక్ శ్రేణి మా ట్రెస్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శ్రీ వరుణ్ తేజ్ కొణిదెల, ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కపిల్ చంద్ నర్రా, డ్యూరోఫ్లెక్స్ ప్రై.లి. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మాథ్యూ చాండీ, డ్యూరోఫ్లెక్స్ ప్రై.లి. ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రాజ్ జె పాల్గొన్నారు.

ఒక వ్యక్తి  వెన్నెముక పగటిపూట చాలా ఒత్తిడికి లోనవుతుంది. పదేపదే భారీగా బరువులెత్తడం లేదా ఆకస్మిక ఇబ్బందికరమైన కదలికలు వంటి కొన్ని రోజువారీ కార్యకలాపాలు కండరాలను వెనక్కి నెట్టడం మరియు బాధా కరమైన కండరాల నొప్పులకు కారణమవుతాయి. వినియోగదారులలో పెరుగుతున్న వెన్నెముక సమస్యల కారణంగా, డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ ఆర్థోపెడిస్టులతో కలిసి దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన బ్యాక్ సపోర్ట్ సిస్టమ్‌ను అందించే ఒక ఆర్థోపెడిక్ మాట్రెస్ ను రూపొందించింది. ఒక విశ్వసనీయ ఆర్థోపెడిక్ మాట్రెస్ ను రూపొందించడానికి ఒక మాట్రెస్ బ్రాండ్ ధ్రువీకరించబడిన నిపుణులతో జతకట్టిన మరియు ప్రఖ్యాత ఆర్థోపెడిస్టులచే అది పరీక్షించబడిన మరియు ధ్రువీకరించబడిన   మొదటి మరియు ఏకైక సందర్భం ఇదే.

డ్యూరోపెడిక్ మాట్రెస్ శ్రేణి బాగా విశ్రాంతిని అందించే నిద్రకు వీలు కల్పించేలా సౌకర్యం, సపోర్ట్ మధ్య సంపూర్ణ సమ తుల్యతను నిర్ధారిస్తుంది. ఈ ఆర్థోపెడిక్ శ్రేణి మాట్రెస్ లు డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ యొక్క స్లీప్ ల్యాబ్‌లో, నేషనల్ హెల్త్ అకాడమీకి చెందిన ప్రఖ్యాత ఆర్థోపెడిస్ట్‌లతో కలిసి 8 నెలల పరీక్ష కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. మాట్రెస్ డిజైన్ ఈ తరహాలో మొదటిదిగా 5-జోన్డ్ ఫుల్ ప్రోన్ సపోర్ట్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతికత వెన్నుకు అవసరమైన ఆధునిక మద్దతును అందిస్తుంది.

డ్యూరో ఫ్లెక్స్ మాట్రెస్ యొక్క డ్యూరోపెడిక్ శ్రేణి మాట్రెస్ ఆవిష్కారం సందర్భంగా ప్రముఖ నటుడు శ్రీ వరుణ్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ, నటన మరియు ఫిట్ నెస్ అనే రెండూ కూడా నా జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. సెట్ లో లేదా జిమ్ లో ఎక్కువ సేపు గడపడం నా శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. ఈ సమస్యకు డ్యూరో ఫ్లెక్స్ మాట్రెస్ యొక్క డ్యూరోపెడిక్ మాట్రెస్ శ్రేణి ఒక చక్కటి పరిష్కారంగా ఉంటుంది. సరైన బ్యాక్ సపోర్ట్  మరియు పోశ్చర్ అలైన్ మెంట్ తో డ్యూరోపెడిక్ మాట్రెస్, నా శరీరం కోసం నాకేది అవసరమో దాన్ని అందిస్తుం ది. ఆర్థోపెడిక్స్ చే ధ్రువీకరించబడిన భారతదేశ ఏకైక మాట్రెస్ ను ప్రవేశపెట్టడంలో ఆర్థోపెడిస్టులతో కలసి పని చేయడం ద్వారా డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ ఒక గొప్ప పని చేసింది. మీ వెన్నును సంరక్షించుకునేందుకు గాను, ఆర్థోపెడిక్ చే ధ్రువీకరించబడిన మాట్రెస్ ను మాత్రమే ఎంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను’’ అని అన్నారు.

మీడియా సమావేశంలో డ్యూరోఫ్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ మాథ్యూ చాండీ మాట్లాడుతూ, "వినియోగదారులలో వెన్ను సమస్యలు అధికం కావడంతో,  వెన్నెముకకు అత్యుత్తమ సపోర్ట్ ను అందించే మ్యాట్రెస్ తయారుచేయాలని మేం భావించాం. ఈ రోజున మార్కెట్లో లభించే అత్యంత అధునాతన ఆర్థోపెడిక్ మాట్రెస్ ను మీ ముందుకు తీసుకురావడానికి సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుల సహకారంతో డ్యూరో పెడిక్ శ్రేణి మాట్రెస్ లు శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి. నేషనల్ హెల్త్ అకాడమీ ధ్రువీకరించిన మాట్రెస్ శ్రేణి కలిగిన ఏకైక బ్రాండ్‌గా మేము గర్విస్తున్నాం. మా వినియోగదారులు నిద్రపోతున్నప్పుడు వారి వెన్నెముక భాగానికి ఉత్తమ సం రక్షణ, పునరుత్తేజాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. డ్యూరోపెడిక్ మాట్రెస్ శ్రేణి లోని 5- జోన్డ్ ఫుల్ ప్రోన్ సపోర్ట్ సిస్టం తన వివిధ స్థితిస్థాపకత పొరలతో ఈ సౌకర్యాన్ని అందిస్తుంది ” అని అన్నారు.

డ్యూరోఫ్లెక్స్ ప్రై.లి. ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రాజ్ జె మాట్లాడుతూ, గత 55 ఏళ్ళుగా డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ అడ్వా న్స్ డ్ స్లీప్ సిస్టమ్స్ లో అగ్రగామిగా ఉంటోంది. వినియోగదారులు సరైన విధంగా విశ్రాంతి తీసుకునేందుకు మరి యు తమ శరీరానికి సౌఖ్యాన్ని పొందేందుకు తోడ్పడుతోంది. మేము మా ఉత్పాదనలను ఆవిష్కరించడం లో మాత్రమే గాకుండా, ఇన్ స్టోర్ అనుభూతిని అందించడంలో కూడా అగ్రగామిగా ఉన్నాం. వెన్ను సమస్యలు అనేవి సాధారణ సమస్య. దాన్ని పరిష్కరించడంలో తోడుగా ఉండేలా మేము డ్యూరోపెడిక్ శ్రేణి మాట్రెస్ –  ఇతర మాట్రెస్ మాదిరిగా గాకుండా నిపుణులచే ధ్రువీకరించబడిన భారతదేశ మొట్టమొదటి ఆర్థోపెడిక్ మాట్రెస్ – ను మేము ప్రవేశపెట్టాం. వినియోగదారులు తమ వెన్నుకు ఏది అవసరమో దాన్ని వినియోగదారులకు ఇది పరి పూర్ణంగా అందిస్తోంది. వెన్ను సమస్యలను పరిష్కరించడంలో మరియు రాత్రిపూట చక్కటి నిద్రను అందించడం లో, ఆరోగ్యదాయక జీవితం గడిపేలా చేయడంలో తోడ్పడుతుంది అని అన్నారు.

ఆర్థోపెడిక్, స్పోర్ట్స్  ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కపిల్ చందా నర్రా మాట్లాడుతూ, ‘‘వ్యక్తుల వెన్నెముకకు  అవసర మైన సరైన సపోర్ట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, “కూర్చున్నా లేదా నిద్రపోతున్నా ఆదర్శవంతమైన  శక్తి వ్యయం కనీసంగా ఉండాలి, సరైన వెన్నెముక మద్దతు ఉండాలి. తద్వారా మనం ఎక్కువ సేపు నిద్రించగలు గుతాం. ఇది మన శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మంచి నిద్రను ప్రేరేపించడం చాలా ముఖ్యం. డ్యూరోపెడిక్ శ్రేణి లో ఉపయోగించే 5- జోన్ ఫుల్ ప్రోన్ సపోర్ట్ సిస్టమ్ వెన్నెముక కు మరియు వివిధ శరీర ప్రాంతాలకు వాటికి అవస రమైన మద్దతును ఇస్తుంది. రోజంతా వివిధ పనుల్లో బాగా అలసిపోయిన తర్వాత నిద్రపోతున్నప్పుడు వె న్నుకు ఈ మద్దతు అవసరం అని అన్నారు.

5 జోన్డ్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏమిటి?

మానవ శరీరం 5 జోన్లుగా విభజించబడింది. ఈ జోన్లలో ప్రతి ఒక్క దానికి కూడా అది మోసే బరువు ఆధారం గా విభిన్న మద్దతు అవసరం. దీని అర్థం, మ్యాట్రెస్ ఈ 5 జోన్లకు అవసరమైన   విభిన్న మద్దతును అందించ గల గాలి. డ్యూరోపెడిక్ శ్రేణిలోని మాట్రెస్ లలోని 5-జోన్డ్ ఫుల్ ప్రోన్ సపోర్ట్ సిస్టమ్ ఈ అధునాతన మద్దతును వెన్నెముకకు అందించగలదు.

డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ ఇప్పుడు దేశంలోని అన్ని ప్రముఖ దుకాణాల్లో అందుబాటులో ఉంది.  డ్యూరోఫ్లెక్స్ మాట్రె స్ యొక్క డ్యూరోపెడిక్  ఉత్పాదన శ్రేణిని ఆన్‌లైన్ లో www.duroflexworld.com లో చూడవచ్చు.

డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ గురించి:

కేరళ యొక్క బ్యాక్ వాటర్స్ లో మూలాలు కలిగిన డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ 1963 లో అలెప్పీలోని ఒక చిన్న యూ నిట్లో ప్రారంభమైంది. ఈ రోజు ఇది 55 సంవత్సరాల నైపుణ్యంతో, మ్యాట్రెస్, నిద్ర ఉపకరణాల విభాగంలో భారత దేశపు ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థకు భారతదేశంలో 5 తయారీ యూనిట్లు కలిగిఉంది. బెంగళూ రులో కార్పొరేట్ ప్రధాన కార్యాలయం ఉంది. ISO 9001 సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి మాట్రెస్ సంస్థ కూడా డ్యూరో ఫ్లెక్స్ మాట్రెస్. ఇది కఠినమైన నాణ్యత నియంత్రణలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అనుసరణ,  పరిశోధన మరియు అభివృద్ధిలో నిరంతర కృషితో  తన బ్రాండ్ ఉత్పత్తులను వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి  చేస్తోంది.

డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ ఒక బ్రాండ్‌గా, నాణ్యత, ఆవిష్కరణ, సౌకర్యానికి ప్రసిద్ది చెందింది. మేము వినియోగదారుల అవస రాలను బట్టి మాట్రెస్ లకు రూపకల్పన చేస్తాం. స్ప్రింగ్, రబ్బరైజ్డ్ కాయిర్, ఫోమ్‌తో హైబ్రిడ్ మాట్రెస్ లను తయారుచేస్తాం.  మంచి నాణ్యమైన ముడి పదార్థాలు, అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి మేము దిండ్లు, బెడ్ షీట్లు, మాట్రెస్ ప్రొటెక్టర్లు, ఇతర సాఫ్ట్ ఫర్నిషింగ్ ఉత్పత్తులు వంటి ఉపకరణాలను కూడా తయారు చేస్తాం.