ఆ సవాల్‌కు మీ నాన్న పర్మిషన్‌ ఉందా?

ఆ సవాల్‌కు మీ నాన్న పర్మిషన్‌ ఉందా?

20-08-2019

ఆ సవాల్‌కు మీ నాన్న పర్మిషన్‌ ఉందా?

ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటోందని బీజేపీ జాతీయ కార్వనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి స్పందించారు. నడ్డా వ్యాఖ్యాలపై సవాల్‌ విసిరే ముందు కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమని, ఆ సంస్థకు పెద్దలతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు గతంలో ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్‌ ఇదే మాదిరి సవాల్‌ విసిరారని ఆమె ఎద్దేవా చేశారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నేతల ఫిర్యాదుతో రాష్ట్రపతి స్పదించిన ఈ వ్యహారంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంటర్‌ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని నడ్డాకు విజ్ఞప్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.