26 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి

26 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి

19-08-2019

26 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి

టీఆర్‌ఎస్‌కు బీజేపీ తోకపార్టీయేనని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హడావుడి చేస్తోంది కానీ ఆ పార్టీకి విషయం లేదని విమర్శించారు. కొన్ని పొరపాట్ల వల్లే ఓడిపోయాం అని అన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న నార్కట్‌పల్లి నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కోమటిరెడ్డి సృష్టం చేశారు.