బీజేపీ నేతలకు ఇప్పుడే కనిపించిందా?

బీజేపీ నేతలకు ఇప్పుడే కనిపించిందా?

19-08-2019

బీజేపీ నేతలకు ఇప్పుడే కనిపించిందా?

టీఆర్‌ఎస్‌ అవినీతి బీజేపీ నేతలకు ఇప్పుడే కనిపించిందా? అని కాంగ్రెస్‌ నాయకుడు సంపత్‌ ప్రశ్నించారు. ఐదేళ్లు టీఆర్‌ఎస్‌తో అంటకాగి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అవినీతిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడేందుకు గతలో నాగం జనార్దన్‌ రెడ్డికి బీజీపీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్న నేతలపై సంపత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి స్క్రాప్‌ మాత్రమే వెళ్తోందని అన్నారు. అమిత్‌ షా ఓ ఖూనీకోరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలతో తడిసి గుజరాత్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడని అన్నారు.