అవసరమైతే ఏపీ సీఎం కూడా కలవాలి

అవసరమైతే ఏపీ సీఎం కూడా కలవాలి

19-08-2019

అవసరమైతే ఏపీ సీఎం కూడా కలవాలి

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా కాంగ్రెస్‌ ఉద్యమించాల్సిన అవసరముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ అంశంపై సీనియర్‌ నేతలతో సమావేశం నిర్వహించి, ప్రజలను సమీకరించి కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సమస్యలపై కాంగ్రెస్‌ నేతలు మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. యురేనియం అంశంపై ఉద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు యురేనియం తవ్వకాలతో నష్టం జరుగుతుందని, అవసరమైతే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌ను కూడా కలవాలని వీహెచ్‌ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి ఇన్నేళ్లయినా.. చెంచులు జీవితాల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ చలాన్ల పేరుతో పోలీసులు ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని ఆరోపించారు.