రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా వినోద్‌

రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా వినోద్‌

17-08-2019

రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా వినోద్‌

రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ జీవో జారీ చేశారు. ఈ నియామక జీవో ప్రతిని ప్రగతి భవన్‌లో వినోద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళిక మండలి పాత్ర అత్యంత కీలకమైనందున అనుభవజ్ఞుడైన వినోద్‌ను ముఖ్యమంత్రి ఈ పదవిలో నియమించారు. అంతే కాకుండా వినోద్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ, మంత్రివర్గ సమావేశాలకు ఆయన శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పదవిలో వినోద్‌ మూడేళ్లపాటు కొనసాగనున్నారు.