ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం!

ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం!

17-08-2019

ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం!

శాసన సభ్యుల కోటా శాసన మండలి సభ్యుడి (ఎమ్మెల్సీ)గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి (టీఆర్‌ఎస్‌) ఎన్నికల లాంఛనమే కానుంది. ఈ పదవి కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా గుత్తాతో పాటు మరొకరు మాత్రమే నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ల పరిశీలన గడువు అనంతరం గుత్తా నామినేషన్‌ ఒక్కటే మిగిలింది. పోటీలో ఒక్కరే ఉన్నందున ఆయన ఎన్నికైనట్లే. అయితే ఈనెల 19న ఉపసంహరణ గడువు ముగిసిన తదుపరి గుత్తా ఎన్నికను రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) అధికారికంగా ప్రకటిస్తారు.