బీజేపీలోకి దేవేందర్‌గౌడ్‌!

బీజేపీలోకి దేవేందర్‌గౌడ్‌!

17-08-2019

బీజేపీలోకి దేవేందర్‌గౌడ్‌!

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆయనతో బీజేపీ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. దేవేందర్‌ గౌడ్‌ రాజ్యసభ సభ్యత్వం గత జూన్‌తో ముగిసింది. అప్పుడే ఆయనను బీజేపీ జాతీయ నాయకులు సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో ఆయన కొంత తర్జనభర్జన పడ్డారనీ బీజేపీ వర్గాలు తెలిపాయి. తాజా సమీకరణాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు మరోసారి ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు వివరించాయి. దేవేందర్‌ గౌడ్‌తో పాటు ఆయన తనయుడు వీరేందర్‌ కూడా ఆ పార్టీ కండువా వేసుకోనున్నట్లు సమాచారం.