తిరుమల రావడం అదృష్టం

తిరుమల రావడం అదృష్టం

02-09-2017

తిరుమల రావడం అదృష్టం

రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలుత జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌ ప్రాంతంలో పర్యటించానని, రెండో పర్యటనగా దేశంలో ఎంతో పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అందులోనూ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రావడం తన అదృష్టమన్నారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు గ్రామాల్లో అట్టడుగున ఉన్న  ప్రతి కుటుంబానికి చేరాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా పయనిస్తున్నాయని వెల్లడించారు.