తెలుగు దేశానికి తిరుగులేదు : బాలకృష్ణ

తెలుగు దేశానికి తిరుగులేదు : బాలకృష్ణ

29-08-2017

తెలుగు దేశానికి తిరుగులేదు : బాలకృష్ణ

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన నంద్యాల ప్రజలకు సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. భూమా బ్రహ్మానందరెడ్డికి ఆయన అభినందలు తెలిపారు. టిడిపి గెలుపు చరిత్రాత్మకమమన్నారు. అహర్నిశలు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న విషయం ఈ ఎన్నికల ద్వారా మరోసారి సృష్టమైందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనసాగించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.