ప్రశాంత్ కిషోర్ కి ఇది తొలి ఓటమా?

ప్రశాంత్ కిషోర్ కి ఇది తొలి ఓటమా?

28-08-2017

ప్రశాంత్ కిషోర్ కి ఇది తొలి ఓటమా?

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల సరళి వైసీపీ ఎన్నికల వ్యూహ రచయిత ప్రశాంత్ కిషోర్ కి తొలి ఓటమిని మిగిల్చింది. ఇటీవల జరిగిన ప్లీనరీ తో తొలి సారి వైసీపీ వేదిక పై కనిపించిన ప్రశాంత్ కిషోర్ పై పెద్ద చర్చే జరిగింది.వైసీపీ తరుపున అతను డీల్ చేసిన మొదటి ఎన్నిక కూడా నంద్యాలే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక కోసంజగన్ చాలా కష్టపడ్డారు….పార్టీ కూడా బాగా పనిచేసింది. కాపులు, బీసీలు, ముస్లిం లు, వైశ్యులు..ఇలా అన్ని వర్గాలు ఉండడం తో ఎన్నిక మరింత ఆసక్తి గా మారింది. గెలుపుపై టీడీపీ మొదటి నుంచి ధీమాగా ఉన్నా వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. శిల్ప గెలుపు ఖాయం అని పోలింగ్ తర్వాత భావించారు. కానీ ఫలితం టీడీపీ కి దక్కింది. దీంతో జగన్ ఆశలు పెట్టుకున్న, అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన P.K. వ్యూహాలు పనిచేయలేదు అనే చర్చ మొదలయ్యింది. ఒక రకంగా నంద్యాల ఉప ఎన్నిక P.K. ఓటమి….ఇంకా చెప్పాలంటే P.K. తొలి ఓటమి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఇప్పుడు జగన్ ఏంచేస్తారు…ప్రశాంత్ కు అదే ప్రాధాన్యం ఇస్తారా…పక్కన పెట్టేస్తారా…ఇది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.