నంద్యాలలో ముగిసిన పోలింగ్!

నంద్యాలలో ముగిసిన పోలింగ్!

23-08-2017

నంద్యాలలో ముగిసిన పోలింగ్!

అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా, దాదాపు 80శాతం కంటే ఎక్కువగానే పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. నంద్యాల గ్రామీణం, గోస్పాడు మండలాల్లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. మొత్తం 79.20 శాతం పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉండగా, 1,73,335 ఓట్లు పోల్‌ అయ్యాయి. అందులో పురుషుల ఓట్లు 84,831, మహిళల ఓట్లు 88,503. 2009లో 76 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 2014లో 71 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైంది.