ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

21-01-2020

ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్‌ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రనసాద్‌ మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు. తన రాజీనామా లేఖను మీడియాకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విడుదల చేశారు.