చరిత్రలో ఇది చీకటి రోజు

చరిత్రలో ఇది చీకటి రోజు

21-01-2020

చరిత్రలో ఇది చీకటి రోజు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రైతులకు అన్యాయం చేస్తున్నారని, 33 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ బ్యానర్‌, ప్లకార్డులతో ర్యాలీగా ఆయన శాసనసభకు వచ్చారు. శాసనసభ మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. చరిత్రలో సోమవారం బ్లాక్‌ డే. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన సీఎం జగన్‌ మూల్యం చెల్లిసారు. వందలాది మందిని అరెస్టు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు అని అన్నారు.