నెల్లూరు అల్లాయ్‌కు త్వరలోనే శంకుస్థాపన

నెల్లూరు అల్లాయ్‌కు త్వరలోనే శంకుస్థాపన

21-10-2019

నెల్లూరు అల్లాయ్‌కు త్వరలోనే శంకుస్థాపన

నెల్లూరులోని అల్లాయ్‌ అల్యూమినియం ప్లాంటు పనులు వేగవంతం చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్‌నాథ్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరులో ప్రతిపాదిత ఉత్కర్ష అల్యూమినియం ధాతు (అల్లాయ్‌) నిగమ్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని వెంకయ్య కోరారు. నెల్లూరు జిల్లా, కొడలవూరు మండలం, బొడ్డు వారిపాలెంలోని పారిశ్రామిక వాడలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.4వేల కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు గత ఆగస్టు 26న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ మరణంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా వెంకయ్య సూచనపై సానుకూలంగా స్పందించిన రాజ్‌నాథ్‌ ఈ ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.