కంటి వెలుగు ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

కంటి వెలుగు ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

10-10-2019

కంటి వెలుగు ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనంతపురంలో ప్రారంభించారు. రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మూడేళ్లలో ఆరు దశల్లో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తామన్నారు. మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జగన్‌ సృష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. స్క్రీనింగ్‌, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 3, 4, 5, 6 దశల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటీ పరీక్షలు నిర్వహించనున్నట్టు జగన్‌ సృష్టం చేశారు. అంతేకాకుండా అన్ని జబ్బులను ఆర్యోగశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. మొత్తం 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి చేరుస్తామన్నారు.