హరికృష్ణ సేవలు ఎనలేనివి

హరికృష్ణ సేవలు ఎనలేనివి

19-08-2019

హరికృష్ణ సేవలు ఎనలేనివి

నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు హరికృష్ణ చిత్రానికి పూలు వేసి నివాళులర్పించారు. ఆయన తనయులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, కుమార్తె సుహాసినితో మాట్లాడారు. రాష్ట్రానికి, టీడీపీకి హరికృష్ణ చేసిన సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు. కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.