సెప్టెంబర్‌ 2 నుంచి కాణిపాకం బ్రహ్మూెత్సవాలు

సెప్టెంబర్‌ 2 నుంచి కాణిపాకం బ్రహ్మూెత్సవాలు

19-08-2019

సెప్టెంబర్‌ 2 నుంచి కాణిపాకం బ్రహ్మూెత్సవాలు

చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన వరసిద్ధి వినాయకుడి బ్రహ్మూెత్సవాలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో కాణిపాకం ఆలయ ఈవో పూర్ణచంద్రరావు ఆహ్వానపత్రికను మంత్రికి అందజేసి బ్రహ్మూెత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ఆయన బ్రహ్మూెత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించి, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బ్రహ్మూెత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.