బీజేపీలోకి సాధినేని యామినీ శర్మ?

బీజేపీలోకి సాధినేని యామినీ శర్మ?

19-08-2019

బీజేపీలోకి సాధినేని యామినీ శర్మ?

తెలుగుదేశం పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న యామినీ శర్మ బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి. జాతీయనేతల సమక్షంలో తొందరలోనే ఆమె కమలం కండువా కప్పుకోనున్నారు. ఇందుకు సంబంధించి గుంటూరుకు చెందిన బీజేపీ నేత శ్రీనివాస్‌ ఇంట్లో ఆమె రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై చర్చించారు. పార్టీలో తన రాకకు సంబంధించి కన్నాతో చర్చించడంతో పాటు పార్టీపరమైన బాధ్యతలపై కూడా ఆమె చర్చించినట్లు తెలిసింది.