రియల్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతుంది. కోవిడ్‍తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నప్పటికీ.. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‍లో రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడుల్లో 40 శాతం వృద్ధిలో ఉంది. 2020 లో రెండు, మూడు త్రైమాసికంలో మందకొడిగా సాగినప్పటికీ చివరి త్రైమాసికంలో 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. కొత్తగా 26,785 యూనిట్లను రియల్ వ్యాపారులు ప్రారంభించారు. రియల్ రంగలో అగ్రగామిగా నిలిచిన బెంగళూర్‍లో సైతం కోవిడ్‍తో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. 2020 త్రైమాసికంలో 4.335 యూనిట్లు ప్రారంభించి 16 శాతంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్‍లో 40 శాతం పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది.
రాష్ట్రంలో 2020 నాలుగో త్రైమాసికంలో 26,785 కొత్త యూనిట్లు ప్రారంభించింది. గతేడాది మూడో త్రైమాసికంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా కొత్త భవనాల కన్‍స్ట్రక్షన్లు ప్రారంభించారు. హైదరాబాద్ 2020 ఏడాది నాలుగో త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ గృహా నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 10,313 యూనిట్లు ప్రారంభించింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే, 5396 కొత్త యూనిట్లతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త శిఖరాలను చేరుకుంది. గత నాలుగైదు సంవత్సరాలతో పోల్చితే రియల్ రంగం ఉన్నత స్థాయిని చేరుకుందని ఇటీవల జెఎల్‍ఎల్ వెల్లడించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా రెసిడెన్షియల్ గృహాలపై దృష్టి పెట్టారు. 2020 ఏడాది చివరి త్రైమాసికంలో 3,750 యూనిట్లు ప్రారంభించింది. గతంలో పోల్చితే 56 శాతం వృద్ధిలో ఉంది. హైదరాబాద్‍లో కొండాపూర్, కోకాపటే, హఫీజ్‍పేట్, నార్సింగ్ ప్రాంతాలూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటి, మౌలిక సదుపాయాల పెంపుతో నగరంలో స్థాపించిన ఐటీ హబ్‍లకు ఇక్కడ నుంచి రవాణ సౌకర్యాలు మెరుగయ్యాయి. హైదరాబాద్ తూర్పు, ఉత్తర శివారు ప్రాంతాల్లో కొనుగోలుదారులకు వీలుగా కొత్త యూనిట్లు విస్త•తం చేస్తున్నారు.
కొండపూర్, హఫీజ్‍పేట్, కోకాపేట లో కొత్త యూనిట్లకు ప్రాధాన్యత లభించింది. ఈ త్రైమాసికంలో మొత్తం కొత్త యూనిట్లలో 31 శాతం ఈ ప్రాంతాల్లో చేపడుతున్నారు. హైదరాబాద్ రెసిడెన్షియల్ అమ్మకాలలో సానుకూల ట్రాన్సాక్షన్ 2020 చివరి త్రైమాసికంలో కూడా కొనసాగింది. రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు నాలుగో త్రైమాసికంలో 68 శాతం వృద్ధిలో ఉన్నట్లు జెఎల్‍ఎల్ వెల్లడించింది.