ASBL NSL Infratech

షారుఖ్ స‌ర‌స‌న స‌మంత‌?

షారుఖ్ స‌ర‌స‌న స‌మంత‌?

గతేడాది ప‌ఠాన్, జ‌వాన్, డంకీ సినిమాల‌తో మంచి విజ‌యాలందుకున్న షారుఖ్ ఖాన్ సూప‌ర్ జోష్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న కూతురు సుహానాను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసే ప‌నుల్లో బిజీగా ఉన్న షారుఖ్ ఆ సినిమాలో ఆయ‌న కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే షారుఖ్ హీరోగా డంకీ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ మ‌రోసారి త‌మ కాంబోని రిపీట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

యాక్ష‌న్, అడ్వెంచ‌ర్, దేశ‌భ‌క్తి క‌ల‌గ‌లిపిన ఓ క‌మ‌ర్ఫియ‌ల్ సబ్జెక్ట్ ను షారుఖ్ కోసం రెడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ బ్యూటీ స‌మంత పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. రాజ్ అండ్ డీకే డైరెక్ష‌న్ లో సిటాడెల్ హ‌న్నీ బ‌న్నీ వెబ్ సిరీస్ లో న‌టించిన స‌మంత‌కు ఈ సినిమా ఆఫ‌ర్ వ‌స్తే మాత్రం అది పెద్ద ప్ర‌మోష‌న్ గానే చెప్పొచ్చు.

ఇది అఫీషియ‌ల్ గా తెలియడానికి మ‌రికాస్త టైమ్ ప‌ట్టేట్లుంది. ప్ర‌స్తుతం క‌థ‌లు వింటున్న స‌మంత ఎవ‌రికీ ఓకే చెప్ప‌డం లేదు. సొంత బ్యాన‌ర్ లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ష‌న్ లో రాబోతున్న సినిమా కోసం అడిగారంటున్నారు కానీ అదెంత వ‌ర‌కు నిజ‌మో అనౌన్స్‌మెంట్ వ‌చ్చే వ‌ర‌కు తెలియదు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :