హిట్3లో విలన్ ఎవరో తెలుసా?
నాని(Nani) హీరోగా శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(Hit3) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ హిట్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన సినిమాలు ఆడియన్స్ కు ఓ కొత్త అనుభూతినిస్తూంటాయి. ఈ నేపథ్యంలో హిట్3 పై భారీ అంచనాలున్నాయి.
హిట్3 ని నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్(Wallposter Cinemas) బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. కథ డిమాండ్ మేరకు హిట్3 షూటింగ్ వివిధ రాష్ట్రాల్లో డైరెక్టర్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. నానికి జోడీగా శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
క్రైమ్ ను ఆర్గనైజ్ చేసే విలన్ పాత్ర హిట్3 సినిమాకు ఎంతో కీలకం. ఆ క్యారెక్టర్ మీదే హీరో రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది డిపెండ్ అయి ఉంటుంది. హిట్3లో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్(Mizapur) ఫేమ్ అలీ ఫజల్(Ali Fazal) ను ఎంపిక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే అలీ హిట్3 సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఇందుకోసం అలీ ఫజల్‌కు నిర్మాత నాని భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. హిట్3 షూటింగ్ మొత్తాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని నాని చూస్తున్నడట. ఆ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.