ASBL Koncept Ambience
facebook whatsapp X

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌ ... ఇకపై

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌ ... ఇకపై

సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ లో మరో సదుపాయం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వాట్సప్‌లోనూ మెన్షన్‌ ఫీచర్‌ను జోడించాలని చూస్తోంది. తాజాగా దాన్ని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్‌ చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులకు ఏ  సాయంతో ట్యాగ్‌ చేస్తుంటా. అంటే సదరు వ్యక్తికి మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్‌ అందుతుంది. అలా వాళ్లు మన స్టోరీని చూస్తారు. అచ్చం అలాంటి సదుపయాన్నే వాట్సప్‌ జోడించింది. దీంతో ఇకపై వాట్సప్‌లో స్టేటస్‌ పెట్టే సమయంలో కాంటాక్ట్‌లో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్‌ చేయొచ్చు. వాట్సప్‌లో స్టేటస్‌ అప్‌లోడ్‌ చేసే సమయంలో యాడ్‌ క్యాప్సన్‌ అనే బార్‌కు కుడివైపున ఏ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానీ మీ వాట్సప్‌లోని కాంటాక్ట్స్‌ అన్నీ దర్శనమిస్తాయి. వాటిలో మీకు నచ్చిన వ్యక్తులకు మెన్షన్‌ చేయొచ్చు. స్టేటస్‌ అప్‌డేట్‌లో మెన్షన్‌ చేసేవారికి దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ అందుతుంది. అయితే ఇన్‌స్టా తరహాలో ట్యాగ్‌ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదని మెసేజింగ్‌ యాప్‌ ఇప్పటికే ప్రకటించింది. వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండా ఈ ఫీచర్‌ను రూపొందించింది. మెన్సన్‌ ఫీచర్‌ దాదాపు అందరి యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :