ASBL NSL Infratech

ప‌లు ప‌నుల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బిజీ

ప‌లు ప‌నుల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బిజీ

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హ‌ను మాన్ సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ బాగా పెరిగింది. అప్ప‌టివ‌ర‌కు చిన్న డైరెక్ట‌ర్ అని త‌క్కువ అంచ‌నా వేసిన అత‌న్ని, ఆ సినిమా త‌ర్వాత గొప్ప డైరెక్ట‌ర్ అనేశారు. హ‌నుమాన్ వ‌చ్చి ఆరు నెల‌ల‌వుతున్నా ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న త‌ర్వాతి సినిమాను ఇప్ప‌టివ‌ర‌కు క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు.

హ‌నుమాన్ కు సీక్వెల్ గా జై హ‌నుమాన్ ఉంటుంద‌ని అనౌన్స్ చేశారు కానీ అందులో క్యాస్టింగ్ ఎవ‌రు?  షూటింగ్ ఎప్ప‌టినుంచి అనే విష‌యాలు మాత్రం ఇంకా ఫైన‌ల్ అవ‌లేదు. ఈ గ్యాప్ కు కార‌ణం ప్ర‌శాంత్ వ‌ర్మ, ర‌ణ్‌వీర్ తో ప్లాన్ చేసుకున్న బాలీవుడ్ సినిమానే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కాల్సిన సినిమా స‌డెన్ గా ఆగిపోయింది.

ఆ సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ ఖాలీగా ఏమీ లేడు. త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ కు సంబంధించిన క‌థ‌లను రెడీ చేస్తున్నాడు. గ‌తంలో తాను ఒప్పుకున్న అధీరాను వేరే డైరెక్ట‌ర్ తో చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఆక్టోప‌స్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వ‌డానికి మ‌రోవైపు ట్రై చేస్తున్నాడు. అశోక్ గ‌ల్లా హీరోగా వ‌స్తున్న తాను క‌థ అందించిన దేవ‌కీనంద‌న షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోకి అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే జై హ‌నుమాన్ ముందు చెప్పిన‌ట్టు 2025 లో వ‌చ్చే ఛాన్స్ అయితే లేదు. స్టార్ క్యాస్ట్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌, అంతా సిద్ధ‌మైతే త‌ప్పించి షూటింగ్ కు వెళ్లేలా లేడు. హ‌నుమాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డంతో ప్ర‌శాంత్ వ‌ర్మ నెక్ట్స్ సినిమాపై అంద‌రూ ఆస‌క్తిగా ఉన్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :