ASBL Koncept Ambience
facebook whatsapp X

రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన విజయ్

రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన విజయ్

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాల‌నేది కొంత మందిని చూసి నేర్చుకోవాలి. అలానే కెరీర్లో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా స‌రే త‌మ‌కు ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన వారిని మ‌ర్చిపోకూడ‌ద‌నేది చాలా త‌క్కువ మంది పాటిస్తుంటారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అలాంటి గ్రాటిట్యూడ్ ని క‌ల్కి కోసం చూపించాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క‌ల్కి 2898 ఏడీ వ‌చ్చే వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ గొప్ప విజువ‌ల్ వండ‌ర్ లా తీర్చిదిద్దాడ‌ని ఇప్ప‌టికే రిలీజైన రెండు ట్రైల‌ర్లు చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఓ స‌ర్‌ప్రైజ్ కామియో చేయ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

వైజ‌యంతి బ్యాన‌ర్ తో మంచి బాండింగ్ ఉన్న యువ స్టార్లంతా క‌ల్కి కోసం వ‌ర్క్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజ‌య్ పాత్ర క‌ల్కిలో చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని లీకులందుతున్నాయి. మామూలుగా రూ.600 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన క‌ల్కిలో ఏదైనా స్పెష‌ల్ పాత్ర చేయిస్తే ఆ పాత్ర కోసం భారీ రెమ్యూన‌రేష‌నే ఇస్తారు. కానీ విజ‌య్ ఈ సినిమాకు అస‌లు రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండానే న‌టించాడ‌ని తెలుస్తోంది. త‌న‌కు ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాతో మొద‌టి ఛాన్స్ ఇచ్చినందుకు రిట‌ర్న్ గిఫ్ట్ గా విజ‌య్, క‌ల్కిలో వ‌ర్క్ చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :