ASBL NSL Infratech

టంపాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయోత్సవ సంబరాలు

టంపాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంపై అమెరికాలోని టంపాలో టీడీపీ, జనసేన అభిమానులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎన్నారై టీడీపీ టంపా బృందం నిర్వహించిన టంపాలోని ఐసీసీ హల్‌లో జరిగిన ఈ సంబరాలకు వందలాది టీడీపీ, జనసేన,బీజేపీ అభిమానులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కోసం తెలుగు ప్రజలు కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థలు ఎలా ధ్వంసమయ్యాయి..? కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు...? టీడీపీ, జనసేన కూటమికి అండగా ప్రవాసాంధ్రులు పోషించిన పాత్ర ఇలా అనేక  అంశాలను ఈ సంబరాల్లో చర్చించారు. కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్ర ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన ఈ తీర్పు నిరంకుశ పాలనను అంతం చేసిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ఎన్.ఆర్.ఐలు కూడా తమ వంతు బాధ్యతగా చేసిన కృషిని వివరించారు. గొప్ప అధికారంతో గొప్ప బాధ్యత వస్తుందని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాళహస్తి సత్యనారాయణ  ఈ సమావేశంలో పేర్కొన్నారు. విజయోత్సవ సంబరాలకు అతిధిగా హాజరైన సత్యనారాయణ ప్రస్తుత ప్రభుత్వం మీద హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని.. విధ్వంస పాలనతో అధోగతి పాలైన రాష్ట్రాన్నిగాడిన పెట్టడానికి ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కేవలం చంద్రబాబు కృషి మాత్రమే సరిపోదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రవాసాంధ్రులు అందరూ కలిసి రాష్ట్ర ప్రగతికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  

ఎన్నారై టీడీపీ టంపా టీమ్ నిర్వహించిన ఈ విజయోత్సవ సంబరాలకు ఆర్థిక సహాయం అందించిన శ్రీనివాస్ గుత్తికొండతో పాటు ఈ సంబరాల నిర్వహణలో మనుబిక్కసాని, అశోక్ యార్లగడ్డ, ప్రసాద్ ఆరికట్ల, శ్రీకాంత్ కనకమేడల, నరేష్ పాలడుగు, సుబ్బారావు జంపాల, కిరణ్ పొన్నం, అభయ్ ముప్పవరపు, శ్రీమంత్ మద్దిపట్ల, సతీష్ రామినేని, వీరాంజనేయులు నాగుల్, బాల నేమాని, శేఖర్ నేమాని, సతీష్ కడియాల, రంజిత్ పాలెంపాటి, రాజ్ పోపూరి, రామ్ పాలెం, వెంకట్ నెక్కంటి, రాజ్ కాళహస్తి,శ్రీధర్ కొత్తపల్లి, వేణు నిమ్మగడ్డ, నరసింహ నెలూరి, వీర జంపని, లీలాధర్ తాతినేని, ప్రవీణ్ వాసిరెడ్డి, శివ చెన్నుపాటి, రమేష్ దద్దాల, సిద్దయ్య తోట, సందీప్ కొల్లూరి, రావు చాపలమడుగు, దేవేంద్ర కొమ్మినేని తదితరులు కీలక పాత్ర పోషించారు. 

ఈ వేడుకలు కోసం తమ వంతు సహకారాన్ని అందించిన ఎన్నారై టీడీపీ టంపా టీమ్ సుధాకర్ మున్నంగి, సుమంత్ రామినేని, శ్రీనివాస్ మల్లాది రామ్మోహన్ కర్పూరపు, స్వరూప్ అంచె, చంద్ర పెద్దు అజయ్ దండముడి, జనసేన సభ్యులు సునీల్ ఆరాణి, దిలీప్ వాసా, గంగాధర్, రమేష్ పులస, గోపీచంద్, రాజ్ అన్నే, మన్సూర్, వరుణ్, అనంత్ కుమార్, రాజేష్ యమసాని  బీజేపీ సభ్యులు పవన్ నర్రావుల తదితరులకు ఎన్నారై టీడీపీ టంపా టీమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఎన్నారై టీడీపీ టంపా టీమ్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో ఈ సంబరాలను విజయవంతం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :