టీజర్‌తో క్షణం క్షణం ఉత్కంఠ రేపి, ప్రమోషన్స్‌తో అనుక్షణం ఆసక్తి క్రియేట్ చేస్తున్న 'వీక్షణం' టీం
రామ్ కార్తీక్,( Ram Karthik) కశ్వి (Kashvi)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”(Vikshanam). ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి పాటలకు అందించిన బాణీలు, టీజర్‌లో విన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా పై మరింత ఆసక్తి కలిగేలా చేసింది . అలాగే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండగా బిగ్ బాస్ ఫేమ్ సెలబ్రిటీలతో కూడా ఒక రేంజ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇక త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.