ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇదీ.. విజ‌య్ రేంజ్!

ఇదీ.. విజ‌య్ రేంజ్!

కోలీవుడ్ లో ఎన్నో ఏళ్ల నుంచి నెంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగారు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్(Super star Rajinikanth).  కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో ఆయ‌న ఫాలోయింగ్, మార్కెట్ త‌గ్గుతూ వ‌చ్చాయి. అదే టైమ్ లో విజ‌య్(Vijay) కు మార్కెట్, ఫాలోయింగ్ బాగా పెరిగాయి. గ‌త కొన్నేళ్లుగా విజ‌య్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మ‌వుతోంది. టాక్ ఎలా ఉన్నా ఆయ‌న సినిమాల‌కు ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి.

నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవుతున్నాయంటే ఆయ‌న మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే లియో(Leo), గోట్(The Greatest Of All Time) సినిమాల‌కు టాక్ బాలేక‌పోయినా వంద‌ల కోట్లు వ‌సూలు చేశాయి. అయితే విజ‌య్ రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు చివ‌రిగా హెచ్. వినోద్(H. Vinoth) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొద‌లవ‌డం ఆల‌స్యం అప్పుడే ఓవ‌ర్సీస్ థియేట్రిక‌ల్ డీల్ పూర్తైన‌ట్లు తెలుస్తోంది. రూ. 78 కోట్ల భారీ మొత్తానికి ఫార్ ఫిల్మ్(Far Films) సంస్థ అన్ని దేశాల‌కు సంబంధించిన రైట్స్ ను కొనేసిన‌ట్లు స‌మాచారం. ఓ రీజ‌న‌ల్ సినిమాకు ఓవ‌ర్సీస్ రైట్స్ ఇంత రేటుకు అమ్ముడుపోవ‌డం చాలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే సినిమా మొత్తం బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి ఈ సినిమా రిలీజ్ అవుతుందంటున్నారు. అయితే ప్ర‌స్తుతానికి విజ‌య్ న‌టించే ఆఖ‌రి సినిమా ఇదే అంటున్నారు కానీ రాజ‌కీయాల్లోకి వెళ్లాక అక్క‌డ ఫ‌లితాన్ని బ‌ట్టి ఆయ‌న త‌ర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :