ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ రైతులకు శుభవార్త... 2023 డిసెంబర్ 9లోపు

తెలంగాణ రైతులకు శుభవార్త... 2023 డిసెంబర్ 9లోపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 2023 డిసెంబర్‌ 9లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలోనే రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు అందుకు కావాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలకు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :