ASBL NSL Infratech

బోస్టన్‌లో తానా ఆధ్వర్యంలో ఫాదర్స్‌ డే...

బోస్టన్‌లో తానా ఆధ్వర్యంలో ఫాదర్స్‌ డే...

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) న్యూ ఇంగ్లాండ్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో హాప్కిన్టన్‌ బోస్టన్‌లో ఫాదర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వలివేటి శ్రీహరి ఆధ్వర్యంలో ఈ వేడకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తండ్రుల ప్రాముఖ్యతను వివరించారు. మరోవైపు స్థానిక కళాకారులు, పాఠశాల విద్యార్థులు కలిసి పాటలు, నృత్యాలు, వివిధ రకాల స్కిట్లను ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన వారికి వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. తండ్రి-పిల్లల క్విజ్‌లు వంటి స్నేహపూర్వక పోటీలు అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించాయి.

ఈ సందర్భంగా సంఘ నాయకులు, స్థానిక ప్రముఖులతో సహా ప్రత్యేక అతిథులు తమ అనుభవాలను పంచుకున్నారు.  ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల తండ్రులను గౌరవించడమే కాకుండా అన్ని కుటుంబాలను దగ్గర చేసినట్లు అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పిల్లలంతా కలిసి కేక్‌ కట్‌ చేసి, వారి వారి తల్లిదండ్రులకు తినిపించారు. ఈ కార్యక్రమానికి రమణ అవదూత కుటుంబ సభ్యులతో పాటూ రవి దాదిరెడ్డి, శ్రీహరి రాయవరపు, గారెపల్లి వెంకటేశ్వరరావు, చాగంటి శ్రీనివాసు, వెంకట కొప్పవోలు, బచ్చు శ్రీనివాసు, నిరంజన్‌ అవధూత, శ్యామ్‌ సబ్బెల్ల, ఆనంద్‌ గొర్రె, రామకృష్ణ తడపనేని, శ్రీనివాస్‌ పచ్చల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, తానా న్యూఇంగ్లండ్‌ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్‌ ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :