సుక్కూ ఈసారి కూడా దొరికేట్టు లేడుగా
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి చాలా కీలకం. హీరో హీరోయిన్లతో పాటూ డైరెక్టర్ కూడా ఆ ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ప్రెస్‌మీట్స్ కు హాజరవుతూ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. కానీ సుకుమార్(Sukumar) మాత్రం తన సినిమా రిలీజ్ ముందు మీడియాకు అసలు దొరకడు.
దానికి కారణం సుకుమార్ చివరి నిమిషం వరకు తన సినిమాలను చెక్కుతూ ఉండటమే. రిలీజ్ కు ఒకట్రెండు రోజుల ముందు వరక్కూడా సుక్కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంటాడు. పుష్ప రిలీజ్ టైమ్ లో రిలీజ్ ముందు రోజు రాత్రి పెట్టిన ఓ చిన్న ప్రెస్ మీట్ కు తప్పించి సుక్కూ దేనికీ హాజరవలేదు. పుష్ప1(Pushpa1)కు అంత హడావిడి అయిన నేపథ్యంలో పుష్ప2 విషయంలో సుకుమార్ జాగ్రత్త పడతాడని అందరూ అనుకున్నారు.
కానీ ఈసారి కూడా కథ మారట్లేదని తెలుస్తోంది. పుష్ప2(Pushpa2) రిలీజ్ డేట్ కు ఇంకా నెల కూడా లేదు. కానీ షూటింగ్ మాత్రం దాదాపు 15 రోజుల వరకు ఉన్నట్లు సమాచారం. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండు మూడు యూనిట్లను ఏర్పాటు చేసి సుక్కు ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంత కష్టపడినా నవంబర్ 20కి ఫస్ట్ కాపీ రెడీ అవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. నెలాఖరు వరకు షూటింగే జరిగేట్లుంది. కాబట్టి ఈసారి కూడా సుకుమార్ రిలీజ్ కు ముందు మీడియాకు దొరికేట్లు కనిపించడం లేదు.