ASBL Koncept Ambience
facebook whatsapp X

కంబర్ ల్యాండ్ యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్ లు

కంబర్ ల్యాండ్ యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్ లు

అమెరికాకు చెందిన చరిత్రాత్మకమైన కంబర్‌ల్యాండ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని హోటల్‌ ఆదిత్య పార్క్‌లో స్పాట్‌ అడ్మిషన్లను నిర్వహిస్తుందని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మార్క్‌ హాన్షా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న స్పాట్‌ అడ్మిషన్లకు అవసరమైన పత్రాలతో హాజరు కావాలని తెలిపారు. ఆదిత్య పార్క్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విశ్వవిద్యాలయం అధునాతన డిగ్రీ కోర్సులతో పాటు మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎస్‌ఈఎం) అలాగే మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌  (ఎంఎస్‌ఐటీఎం) లను ప్రవేశపెట్టామని తెలిపారు. మాస్టర్స్‌ ప్రొగ్రామ్‌ కేవలం 5 సెమిస్టర్‌లలో పూర్తయ్యేలా రూపొందించామని ఆయన తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :