మరోసారి ఆ బ్యానర్ లో సిద్దూ సినిమా
డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అలరించాడు. ఆ తర్వాత టిల్లూ స్వ్కేర్(Tillu Square) తో ఆ క్రేజ్ ను మరింత పెంచుకున్న సిద్దూ ఇప్పుడు మరో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం జాక్(Jack), తెలుసు కదా(Thelusu Kadha) లాంటి క్రేజీ ప్రాజెక్టులతో సిద్దూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే సిద్దూ కొత్త కథలు వింటూ టాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి జర్నీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సిద్దూ మరోసారి సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో ఓ కొత్త సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్దూ ఆ బ్యానర్ లో డీజే టిల్లు, టిల్లూ స్వ్కేర్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు.
రవికాంత్ పేరెపు(ravikanth perepu) ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో కృష్ణ అండ్ హిజ్ లీలా(Krishna and His Leela) సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రానుండటంతో దీనిపై ఆసక్తి పెరగడం ఖాయం. అయితే ఈ సినిమా గత సినిమాలా కాకుండా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ మైథలాజికల్ మూవీలో సిద్దూ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడనేది చూడాలి.