ASBL NSL Infratech

EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ సందర్భంగా సెన్సేషనల్ ప్రెస్ మీట్

EVOL మూవీ కి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ సందర్భంగా సెన్సేషనల్ ప్రెస్ మీట్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్ EVOL. (a love story in reverse )  డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ :

తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్‌  అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :