ASBL NSL Infratech

రివ్యూ : 'సత్య' మరో టీనేజ్ ప్రేమకథ

రివ్యూ : 'సత్య' మరో టీనేజ్ ప్రేమకథ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : శివమ్ మీడియా
నటీనటులు:  హమరేష్,  ప్రార్ధనా సందీప్, 'ఆడుగాలం' మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు
సంగీతం: సుందరమూర్తి కేవీ, సినిమాటోగ్రఫీ: ఐ మరుదనాయగం
ఎడిటర్‌: కె సత్యనారాయణ, మాటలు : విజయ్‌కుమార్‌
పాటలు : రాంబాబు గోసాల, లైన్‌ ప్రొడ్యూసర్‌ : పవన్‌ తాత,  
నిర్మాత: శివమల్లాల, రచనా - దర్శకత్వం : వాలీ మోహన్‌దాస్‌
విడుదల తేదీ : 10.05.2024

డిఫరెంట్ కాన్సెప్ట్ తో గతం లో వచ్చిన తమిళ చిన్న బడ్జెట్ చిత్రాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా తమిళంలో హిట్ కొట్టిన రంగోలి మూవీ ని తెలుగులో వచ్చిన డబ్బింగ్  సినిమా 'సత్య'. వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఫిలిం జర్నలిస్ట్ శివమల్లాల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందనేది ఈ రివ్యూలో చూద్దాం!

కథ :

పేద కుటుంబానికి చెందిన సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాక లోని గవర్నమెంట్‌ కాలేజిలో ఇంటర్ప్లస్‌ వన్‌ చదువుకుంటూ ఆడుతూ, పాడుతూ హాయిగా తిరిగే టీనేజ్‌ కుర్రాడు. అయితే తండ్రి మోహన్ కుమార్ గాంధీ అలియాస్ గాంధీ(ఆడుగలం మురుగదాస్) తన కుమారుణ్ని ఏదైనా కార్పొరేట్ కళాశాలలో చేర్పించి, మంచి చదువులు చెప్పించాలనుకుంటారు. ప్రభుత్వ కళాశాల నుంచి కార్పొరేట్ కళాశాలకు వెళ్లిన సత్యకు అక్కడ తోటి విద్యార్థుల నుంచి రక రకాలుగా వివక్షకు గురవుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఓ రోజు స్టూడెంట్స్‌ క్రికెట్‌ ఆడుకుంటుంటే వాళ్లల్లో వాళ్లకి జరిగిన గొడవల్లో పిల్లలందరూ పిచ్చిపిచ్చిగా కొట్టుకుంటారు. సత్య వాళ్లందర్ని తప్పించుకునే క్రమంలో రోడ్డు మీదకు వచ్చి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఏరియా పోలీసులకు తగలటంతో పిల్లల్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళతారు. అప్పుడు సత్య అమ్మ, నాన్న, అక్క అందరూ పరుగు పరుగున పోలీస్‌స్టేషన్‌కి వెళతారు. సత్య నాన్న బాగా చదువుతూ మార్కులు తెచ్చుకునే సత్య చెడు సవాసాల వల్లే పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కవలసి వచ్చింది అనుకుని అర్జెంట్‌గా తను చదివే గవర్నమెంట్‌ కాలేజీనుండి సత్యను మార్చాలని తండ్రిగా తన ప్రయత్నాలు మొదలెడతాడు. గవర్నమెంట్‌ కాలేజీలో ఏ ఫీజలు కట్టే పనిలేకుండా వాళ్లు నివాసముండే బస్తీలో చాకలి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుని హాయిగా సాగిపోతున్న తమ జీవితాల్లోకి ప్రైవేట్‌ కాలేజి, ఫీజులు అనేవి తెలియకుండానే ఎంటర్‌ అయిపోతాయి.

సత్యకి తను చదివే కాలేజి, ఫ్రెండ్స్‌ని వదిలి వెళ్లటం ఇష్టం ఉండదు. కానీ అమ్మ,నాన్న కోసం సరే అంటాడు. అక్కడ నుండి తను ఓ రిచ్‌ ప్రైవేట్‌ కాలేజికి వెళ్తాడు. అక్కడ తన కు పార్వతి (ప్రార్ధన సందీప్‌) పరిచయం కావడం వెంటనే ప్రేమలో పడటం జరుగుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినా, సత్య మాత్రం ఎందుకో కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతుంటారు. మరి అలా ఇమడలేకపోయిన సత్య చివరకు తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించాడా? పార్వతితో తన ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది? తనను కార్పొరేట్ కళాశాలలో చేర్పించడానికి తన తండ్రి గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు?  ఎలాంటి స్టూడెంట్స్‌తో కలిసి సత్య చదువుకున్నాడు? టీచర్స్‌ తనను ఎలా చూశారు? ఇష్టం లేకుండా చేరిన కాలేజితో తనకున్న అనుబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం సినిమా చూడాల్సిందే!

నటీనటుల హావభావాలు:

హీరో గా నటించిన  హమరేశ్ పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. సీనియర్‌ యాక్టర్‌ ఆడుగాలం మురుగదాస్‌ పోటా పోటిగా నటించాడు. కొడుకును ఎవరన్న ఏమన్నా అంటే తట్టుకోలేని తండ్రి పాత్రలో మురుగదాస్‌ నటించిన తీరు బాగుంది. తండ్రి, కొడుకులతో పాటు అమ్మ,అక్క పాత్రలు కూడా ఎంతో హృద్యంగా అనిపించాయి.  అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి,  ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే... అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా హమరేశ్ బాగా నటించాడు. అతనికి జోడీగా నటించిన ప్రార్థన కూడా చాలా క్యూట్ గా నటించింది. హమరేష్ తోటి కుర్రాళ్లు కూడా బాగా నటించారు. సాధారణంగా స్టూడెంట్స్ మధ్య వచ్చే ఇగోలు, కొట్లాటలు అన్నీ మన చుట్టూ జరుగుతున్నట్టు కనిపించేలా వీళ్లు నటించారు. అందులో మనం కూడా ఉన్నట్టు ఫీలయ్యేంతలా కుర్రాళ్లంతా నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు:

సత్య చిత్ర కథకుడు, దర్శకుడు వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా తన టేస్ట్‌ ఎలా ఉంటుందో మొదటి సినిమాలోనే చూపించారు. అతను కుర్రాడు కావడంతో... తను చూసిన కళాశాల వాతావరణం... అక్కడ ఉండే స్టూడెంట్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉండే కుటుంబం... వారి మధ్య ఉండే ఎమోషన్స్ అన్నీ చాలా అబ్జర్వ్ చేసి ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లేలను రాసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా సరదాగా... ఎమోషనల్ గా సినిమాని తీశారు. కొన్ని సీన్స్‌లో మధ్యతరగతి వాడు ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో చెప్పినతీరు ఎంతో బావుంది. కెమెరా వర్క్‌ చేసిన మరుదనాయగం ఎడిటర్‌ సత్యనారాయణ తమ పనిని తాము చక్కగా చేశారు. సత్య సినిమా సంగీత దర్శకుడు సుందరమూర్తి ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాడు. అక్కడక్కడా బోర్ కొట్టే సీన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. తమిళంలో ఈ సినిమాని సతీష్ నిర్మించగా,  తెలుగులో శివం మీడియా బ్యానర్ లో శివ మల్లాల ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అనువాదం చేసి... సినిమాని తెలుగు  ప్రేక్షకులకు అందించారు.

విశ్లేషణ:

భుత్వ కళాశాలల్లో ఉండే చదువుల మీద... అక్కడి వాతావరణం మీద తీసే సినిమాలలో సోల్ ఉంటుంది. స్టూడెంట్స్ మధ్య ఉండే రిలేషన్స్... అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు, చదువుల్లో వారి ప్రోత్సహం... ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి కళాశాల జీవితంతో ముడిపడి ఉంటాయి. అలాంటి సన్నివేశాలన్నీ 'సత్య' సినిమాలో మనకు కనిపిస్తాయి. కార్పొరేట్ చదువులకు లక్షలు డబ్బులు కట్టేందుకు తల్లిదండ్రులు పడే బాధలు, కష్టాలను ఇందులో చూపించారు. అలాంటి సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా... సెకెండాఫ్ లో ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ఓ పేద కుటుంబం... ఓ అబ్బాయిని మంచి చదువులు చదివించాలంటే ఎంత కష్టపడాలి అనేది చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఇలాంటివన్నీ సెకెండాఫ్ లో మనసును తాకుతాయి. కాస్త స్లోగా ఉన్నా... సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. మీరు సరదాగా ఓ సారి సినిమా చూడొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :