ASBL NSL Infratech

మేకోవ‌ర్ చేస్తున్న తేజ్

మేకోవ‌ర్ చేస్తున్న తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో అతి తక్కువ టైమ్ లోనే ఆడియ‌న్స్ ను మెప్పించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధ‌రమ్ తేజ్. త‌న మొద‌టి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం చూశాక అంద‌రూ త‌న ఎన‌ర్జీకి ఫిదా అయ్యారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సాయి తేజ్.

కెరీర్ మంచి జోష్ లో ఉన్న టైమ్ లో యాక్సిడెంట్ వ‌ల్ల సినిమాల‌కు గ్యాప్ వ‌చ్చింది. త‌ర్వాత విరూపాక్ష‌, బ్రో సినిమాలు చేశాడు. బ్రో త‌ర్వాతి సినిమాను సంప‌త్ నందితో చేయాల్సింది కానీ బ‌డ్జెట్ కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో తాజాగా రోహిత్ అనే కొత్త డైరెక్ట‌ర్ తో భారీ ప్లాన్ తో వ‌స్తున్నాడు తేజ్. హ‌ను మాన్ నిర్మాత నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

పీరియాడిక‌ల్ డ్రామాగా తెరకెక్క‌నున్న ఈ సినిమా తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ తో తెరకెక్కుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో తేజ్ లుక్ ఎంతో కొత్త‌గా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. తేజ్ కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెష‌ల్ గా ఉంటుందంటున్నారు. ఈ సినిమా కోసం సాయి తేజ్ త‌న‌ను తాను రెడీ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కెరీర్లో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయి తేజ్ కు ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :